May 11 2021 @ 07:40AM

నటుడు జోకర్‌ తులసి కన్నుమూత

కరోనా వైరస్‌ మరో కోలీవుడ్‌  నటుడిని బలిగొంది. తమిళ సినీపరిశ్రమలో జోకర్‌ తులసిగా గుర్తింపు పొందిన తులసి కరోనా వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈయన అనేక చిత్రాల్లో జోకర్‌ వేషాలు వేయడంతో ఆయనకు జోకర్‌ తులసి అనే వచ్చింది. దేవరాజ్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఓరుత్తన్‌ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈయన.... అనేక చిత్రాల్లో నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన టీవీ నాటకల్లో నటిస్తూ వచ్చారు. కేలడి కణ్మని, వాణి రాణి, నాణల్‌, కోలంగళ్‌ వంటి అనేక సూపర్‌హిట్‌ సీరియల్స్‌లో నటించారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌బారిన పడిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అదేవిధంగా కోలీవుడ్‌ దర్శకుడు దయాళన్‌ జేవియర్‌, నిర్మాత ఆంటోనీలు కూడా కరోనా వైరస్‌ సోకి చనిపోయారు. వీరి మృతిపట్ల కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.