Abn logo
Jul 31 2021 @ 03:17AM

గోల్డెన్‌స్లామ్‌కు జొకో దూరమాయె!

టోక్యో: టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌స్లామ్‌కు దూరమయ్యాడు. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో 6-1, 3-6, 1-6తో ఐదో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ) చేతిలో జొకో ఓడాడు. టోక్యో క్రీడలకు ముందు గోల్డెన్‌స్లామ్‌ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు, ఒలింపిక్‌ స్వర్ణం గెలవడం) సాధించే అరుదైన అవకాశం నొవాక్‌ ముందుండేది. కానీ, తాజా ఓటమితో ఆ చాన్స్‌ను నొవాక్‌ చేజార్చుకున్నాడు. ఈ సెర్బియా వీరుడు ఇప్పటికే ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌తోపాటు వింబుల్డన్‌ టైటిల్‌ కూడా నెగ్గిన సంగతి తెలిసిందే. కాగా.. స్టెఫీగ్రాఫ్‌ (1988) మాత్రమే ఇప్పటివరకు గోల్డెన్‌స్లామ్‌ అందుకున్న ఏకైక టెన్నిస్‌ ప్లేయర్‌.