క్వార్టర్స్‌లో జొకో, నడాల్‌

ABN , First Publish Date - 2021-06-08T06:19:17+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సంచలనాలకు ఫుల్‌స్టా్‌పపడడంలేదు. నిరుటి రన్నరప్‌

క్వార్టర్స్‌లో జొకో, నడాల్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌

 గాఫ్‌, సకారి,  జ్వెరేవ్‌ కూడా

 కెనిన్‌ నిష్క్రమించెన్‌ 


పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సంచలనాలకు ఫుల్‌స్టా్‌పపడడంలేదు. నిరుటి రన్నరప్‌ సోఫియా కెనిన్‌ నాలుగో రౌండ్‌లో ఇంటిబాటపట్టింది.  ఇక పురుషుల్లో టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ ప్రీక్వార్టర్స్‌లో పరాజయం అంచులదాకా వచ్చి గట్టెక్కగా..నడాల్‌ అలవోకగా నెగ్గాడు. అమెరికన్‌ టీనేజర్‌  కొకొ గాఫ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లి అరుదైన రికార్డు అందుకుంది.


జొకోకు చుక్కలు.: వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జొకోను ఇటలీ టీనేజర్‌ లొరెంజో  ముసేటి వణికించాడు. దాంతో 2009 తర్వాత రొలాండ్‌ గారో్‌సలో నొవాక్‌ త్వరగా నిష్క్రమించడం ఖాయమనిపించింది. తొలి రెండు సెట్లను టైబ్రేకర్‌లో 19 ఏళ్ల ముసేటి గెలిచినా పోరాటానికి మారుపేరైన సెర్బియా వీరుడు జొకోవిచ్‌ తదుపరి రెండు సెట్లను సొంతం చేసుకున్నాడు. ఐదో సెట్లో జొకో ఆధిక్యంలో ఉన్న దశలో వెన్నునొప్పితో ముసేటి మ్యాచ్‌నుంచి వైదొలిగాడు. దాంతో 34 ఏళ్ల నొవాక్‌  6-7 (9), 6-7 (7), 6-1. 6-0, 4-0తో  విజయంతో ఊపిరిపీల్చుకున్నాడు. జొకోకిది పారి్‌సలో రికార్డు స్థాయిలో 15వ క్వార్టర్‌ఫైనల్‌ కావడం విశేషం. తదుపరి తొమ్మిదో సీడ్‌ బెరెటినీ (ఇటలీ)తో నొవాక్‌ అమీతుమీ తేల్చుకుంటాడు




డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌ (స్పెయిన్‌) 7-5, 6-3, 6-0 స్కోరుతో సిన్నర్‌ (ఇటలీ)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో 10వ సీడ్‌ ష్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా)ను నడాల్‌ ఢీకొంటాడు. ష్వార్జ్‌మన్‌ 7-6 (9), 6-4, 7-5తో స్ట్రఫ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. ఆరోసీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ) 6-4, 6-1, 6-1తో జపాన్‌ స్టార్‌ కీ నిషికోరిని ఓడించి డవిడోవిచ్‌ ఫోకినా (స్పెయిన్‌)తో క్వార్టర్స్‌ పోరుకు సిద్ధమయ్యాడు. మరో నాలుగో రౌండ్‌లో ఫోకినా 6-4, 6-4, 4-6, 6-4తో డెల్బోనిస్‌ (అర్జెంటీనా)పై నెగ్గాడు. 



సకారి తొలిసారి..: మహిళల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ సకారి 6-1, 6-3 స్కోరుతో నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)కు షాకివ్వడం ద్వారా కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. మరో అమెరికన్‌ కొకొ గాఫ్‌ 6-3, 6-1తో ఓన్స్‌ జెబ్యూర్‌ (ట్యునీసియా)ను ఓడించింది. తద్వారా గత 15ఏళ్లలో గ్రాండ్‌స్లామ్‌ల్లో పిన్నవయస్సులో (17 ఏళ్ల 86 రోజులు) క్వార్టర్స్‌ చేరిన మొదటి క్రీడాకారిణిగా గాఫ్‌ నిలిచింది.


మరో మ్యాచ్‌లో క్రెజిసికోవా 6-2, 6-0తో స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)ను ఓడించింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో రోహన్‌ బోపన్న/ఫ్రాంకో కుగర్‌ (క్రొయేషియా) జోడీ 5-7, 3-6తో స్పెయిన్‌ ద్వయం మార్టినేజ్‌/అండుజార్‌  చేతిలో ఓటమి చవిచూసింది.  

Updated Date - 2021-06-08T06:19:17+05:30 IST