జర్నలిస్టులు క్రీడల్లోనూ రాణించాలి

ABN , First Publish Date - 2022-01-22T04:29:18+05:30 IST

నిత్యం విధి నిర్వహణలో ఉరుకులు పరుగులు తీసే జర్నలిస్టులు క్రీడల్లోనూ రాణించాలని మాజీ రంజీ క్రికెట్‌ క్రీడాకారుడు మలిరెడ్డి కోటారెడ్డి ఆకాంక్షించారు.

జర్నలిస్టులు క్రీడల్లోనూ రాణించాలి
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న మలిరెడ్డి

మాజీ రంజీ క్రీడాకారుడు మలిరెడ్డి 

జేశాప్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు ప్రారంభం

నెల్లూరు (విద్య), జనవరి 21 : నిత్యం విధి నిర్వహణలో ఉరుకులు పరుగులు తీసే జర్నలిస్టులు క్రీడల్లోనూ రాణించాలని మాజీ రంజీ క్రికెట్‌ క్రీడాకారుడు మలిరెడ్డి కోటారెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జేశాప్‌ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీల తొలి మ్యాచ్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిత్యం సమాజంలో జరిగే సంఘటనలు ప్రజల వద్దకు తీసుకెళుతూ బిజీగా ఉండే జర్నలిస్టులు క్రీడల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు.  ప్రతి ఒక్కరూ గెలుపోటములను సమానంగా తీసుకుని సత్తా చాటాలని సూచించారు. సెట్నల్‌ సీఈవో పుల్లయ్య మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఒకే వేదికపై కలిసి క్రీడలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్‌ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై సుమన్‌, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఆర్‌కే యతిరాజ్‌,  జేశాప్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్లా, ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు వై నరేష్‌,  జిల్లా గౌరవాధ్యక్షుడు మౌంట్‌బాటన్‌, అధ్యక్షుడు ఎస్‌ నంద కిషోర్‌, ప్రధాన కార్యదర్శి వై సునీల్‌కుమార్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్రావు, సభ్యులు పాల్గొన్నారు. 

తొలిరోజు విజేతలు..

జర్నలిస్ట్‌ల జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీలు రెండు మైదానాల్లో ఆసక్తిగా జరిగాయి. తొలి మైదానంలో ఆత్మకూరు జట్టుపై సర్వేపల్లి జట్టు, రెండో మైదానంలో గూడూరు జట్టుపై ఎలక్ర్టానిక్‌ మీడియా స్టాఫర్స్‌ జట్టు విజయం సాధించాయి. అలాగే నెల్లూరు రూరల్‌పై కోవూరు, కావలిపై కెమెరామెన్స్‌ జట్టు గెలుపొందాయి. 

Updated Date - 2022-01-22T04:29:18+05:30 IST