జోయాలుక్కాస్‌ ‘బ్యాంగిల్‌ ఫెస్ట్‌’

ABN , First Publish Date - 2021-08-01T06:33:04+05:30 IST

జువెలరీ సంస్థ జోయాలుక్కా్‌స.. బ్యాంగిల్‌ ఫెస్ట్‌ పేరుతో అతి పెద్ద బ్యాంగిల్స్‌ కలెక్షన్‌ ను తీసుకువచ్చింది. అంతేకాకుండా వినియోగదారుల కోసం అత్యుత్తమ ఆఫర్లను ప్రకటించింది.

జోయాలుక్కాస్‌ ‘బ్యాంగిల్‌ ఫెస్ట్‌’

హైదరాబాద్‌: జువెలరీ సంస్థ జోయాలుక్కా్‌స.. బ్యాంగిల్‌ ఫెస్ట్‌ పేరుతో అతి పెద్ద బ్యాంగిల్స్‌ కలెక్షన్‌ ను తీసుకువచ్చింది. అంతేకాకుండా వినియోగదారుల కోసం అత్యుత్తమ ఆఫర్లను ప్రకటించింది. 2021 ఎడిషన్‌లో భాగంగా గాజుల (బ్యాంగిల్స్‌)కు సంబంధించి ప్రత్యేకమైన డిజైన్లు, ప్యాట్రన్స్‌తో పాటు నిపుణులు చేతితో తయారు చేసిన వాటిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జోయాలుక్కాస్‌ తెలిపింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా కస్టమర్లు.. తమకు ఇష్టమైన బ్యాంగిల్స్‌ను నిశితంగా పరిశీలించి ఎంపిక చేసుకోవటమే కాకుండా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. అలాగే మేకింగ్‌ చార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది.


ఈ ఫెస్ట్‌లో వేద నుంచి రూపొందించిన టెంపుల్‌ డిజైన్‌ కలెక్షన్లు, రత్న నుంచి హెరిటేజ్‌, జెనీనా నుంచి టర్కిష్‌ , అపూర్వ నుంచి ఎథ్నో కాంటెంపెరరీ డిజైన్‌ కలెక్షన్స్‌.. అందుబాటులో ఉంటాయని జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ జోయ్‌ అలుక్కాస్‌ తెలిపారు. అంతేకాకుండా గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త 916 బీఐఎస్‌ హాల్‌మార్క్డ్‌ జువెలరీ కోసం పాత బంగారు ఆభరణాలను మార్పిడి చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్‌తో పాటు వినియోగదారులకు జోయాలుక్కా్‌సలో కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఉచిత మెయింటెనెన్స్‌, ఏడాది పా టు ఉచిత బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లోని అన్ని జోయాలుక్కాస్‌ షోరూమ్‌ల్లో ఈ నెల 3 వరకు అందుబాటులో ఉంటుంది. 

Updated Date - 2021-08-01T06:33:04+05:30 IST