Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 25 2021 @ 11:20AM

తపోభూమి మఠంలో పూజలు చేసిన జేపీ నడ్డా

పనజీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం గోవాలోని తపోభూమి మఠంలో పూజలు చేశారు. ఆయన గోవాలో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆయనతోపాటు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. నడ్డా, సావంత్ ఈ మఠంలో మొక్కలు నాటారు. 


అంతకుముందు నడ్డా మంగేశ్ దేవాలయంలో పూజలు చేశారు. 2022లో జరగనున్న శాసన సభ ఎన్నికలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గోవా మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. బీజేపీ అనుబంధ సంస్థల నేతలతో కూడా సమావేశమవుతారు. శనివారం ప్రారంభమైన ఆయన పర్యటన ఆదివారంతో ముగుస్తుంది. 

Advertisement
Advertisement