సర్వ సభ్య సమావేశం రసాభాస

ABN , First Publish Date - 2021-09-18T04:25:38+05:30 IST

సమస్యలపై ప్రజా ప్రతినిధులు నిలదీయ డంతో సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. శుక్రవారం ఎంపీడీవో కా ర్యాలయంలో ఎంపీపీ లావుడ్యా సోనీ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది.

సర్వ సభ్య సమావేశం రసాభాస
ఎంపీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు

జూలూరుపాడు, సెప్టెంబరు 17: సమస్యలపై ప్రజా ప్రతినిధులు నిలదీయ డంతో సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. శుక్రవారం ఎంపీడీవో కా ర్యాలయంలో ఎంపీపీ లావుడ్యా సోనీ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2ః30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించినప్పటికి పలు శాఖల అధికారులు రాకపోవడంపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌, అన్ని శాఖల అధికారులు వచ్చిన తరువాతే సమావే శాన్ని ప్రారంభించాలని వారు కోరారు. సమావేశాన్ని ప్రారంభించి గంట వర కు పలు శాఖల అధికారులు రాకపోవడంపై తాము సమావేశాన్ని బహిష్క రిస్తున్నామని, జడ్పీటీసీ భూక్యా కళావతితో పాటు, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు ప్రకటించి మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్న క్రమంలో తమకు కొం త సమయం ఇవ్వాలని ఎంపీడీవో చంద్రశేఖర్‌ కోరారు. దీంతో ప్రజా ప్రతి నిధులు తమ స్థానాలలో కూర్చున్నారు. అనంతరం కొద్ది సేపటి తరువాత త హసీల్దార్‌తో పాటు, పలు శాఖల అధికారులు హాజరు కావడంతో సమావేశా న్ని 3.30 గంటలకు ప్రారంభించారు. దీంతో గ్రామాలలో నెలకొన్న సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. మిషన్‌ భగీరధ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, ఈ పథకం అస్థవ్యస్థంగా ఉందని అధికార పార్టీకి చెందిన ఎంపిటీసీలు, సర్పంచ్‌లు అధికారులను నిలదీశారు. మరమ్మతులను చేపట్టేందుకు స్థానికులను వర్కర్లుగా నియమించాలని కోరారు. గ్రామాలలో సీసీ రహదారులకు, పాఠశాలల్లో కుంటలు పూడ్చడానికి మట్టి తవ్వకాలకు అ నుమతులు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు కోరగా ఇది తన పరిధి కాదని, జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇవ్వాలని తెలిపారు. తాము పంచాయతీలలో పనులను చేపట్టి నెలలు గడుస్తున్నప్పటికి బిల్లుల చెల్లింపుల్లో సూరారం కార్యదర్శి విజ యలక్ష్మీ, అన్నారుపాడు కార్యదర్శి జ్యోతిలు నిర్లక్ష్యం చేస్తూ తమను ఇబ్బం దులకు గురి చేస్తున్నారని సర్పంచ్‌లు కళావతి, పద్మలు ఎంపీవోను నిలదీశారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పనులు చేపట్టినప్పటికి బిల్లులు చె ల్లించడంలో నిర్లక్ష్యం చేయడం తగదని ఎంపీవో రామారావుపై ఆగ్రహం వ్య క్తం చేశారు. దీంతో మిగిలిన సర్పంచ్‌లు కూడా వారికి మద్ధతు తెలపడంతో కొద్ది సేపే వివాదం నెలకొంది. ఆ రెండు పంచాయతీల కార్యదర్శులను మా ర్చాలని సర్పంచ్‌లు కోరారు. అదేవిధంగా పాఠశాలల్లో పారిశుద్య పనుల నిర్వాహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగించవద్దు అని సర్పంచ్‌లు కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, జెడ్పీటీసీ కళావతి, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-18T04:25:38+05:30 IST