ఫ్రాన్స్‌తో భారత్‌ పోరు షురూ

ABN , First Publish Date - 2021-10-21T09:22:38+05:30 IST

భారత్‌ ఆతిథ్యమివ్వనున్న జూనియర్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌ షెడ్యూల్‌ బుధవారం విడుదలైంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో వచ్చేనెల 24 నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్‌లో

ఫ్రాన్స్‌తో భారత్‌ పోరు షురూ

  • జూ.హాకీ ప్రపంచకప్‌ షెడ్యూల్‌ 


లుసాన్నె: భారత్‌ ఆతిథ్యమివ్వనున్న జూనియర్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌ షెడ్యూల్‌ బుధవారం విడుదలైంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో వచ్చేనెల 24 నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఆతిథ్య జట్టు, డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తన పోరును ఫ్రాన్స్‌తో ప్రారంభించనుంది. పూల్‌-బిలో కెనడా, ఫ్రాన్స్‌, పోలెండ్‌లతో కలిసి ఉన్న భారత్‌ తన తొలి మ్యాచ్‌ను టోర్నీ ఆరంభ రోజునే ఆడనుంది. అనంతరం నవంబరు 25న కెనడాతో, 27న పోలెండ్‌తో భారత్‌ తలపడుతుంది. డిసెంబరు 3న సెమీఫైనల్స్‌, 5న ఫైనల్‌ జరుగుతాయి. కొవిడ్‌ నేపథ్యంలో ప్రయాణ సమస్యల కారణంగా ఇంగ్లండ్‌ అర్ధంతరంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆ జట్టు స్థానంలో పోలెండ్‌కు చోటు దక్కింది. 

Updated Date - 2021-10-21T09:22:38+05:30 IST