Jul 30 2021 @ 22:38PM

తహశీల్దార్‌ కార్యాలయంలో ఎన్టీఆర్‌

శంకర్‌పల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సందడి చేశారు. గోపాలపురం రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ పనుల కోసం స్వయంగా ఆయనే ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది. అక్కడి అధికారులు, సిబ్బంది తారక్‌తో ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.