మెగాస్టార్ చిరంజీవికి యంగ్ టైగర్ ఎన్టీయార్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశాడు. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. తెలుగులో దీనికి `రౌద్రం రణం రుధిరం` అనే క్యాప్షన్‌ను ఫిక్స్ చేశారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఉగాది సందర్భంగా ట్విటర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి `ఆర్ఆర్ఆర్` మోషన్ పోస్టర్‌ను ప్రశంసించారు. అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. దీనికి స్పందించిన ఎన్టీయార్.. `ధన్యవాదాలు సర్. మీ నుంచి వచ్చిన ఈ ప్రశంస ఎంతో విలువైనది. ట్విటర్‌లోకి మీకు స్వాగతం` అంటూ రిప్లై ఇచ్చాడు. `కింగ్` నాగార్జున, సూపర్‌స్టార్ మహేష్ బాబు, రాజమౌళి తదితరులు కూడా చిరంజీవికి వెల్కమ్ చెప్పిన సంగతి తెలిసిందే.