Abn logo
Jun 18 2021 @ 02:49AM

జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదల

పీలేరు, జూన్‌ 17: హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జడ్జి రామకృష్ణ గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఏప్రిల్‌ నెల 12న ఓ టీవీ చానల్‌ డిబేట్‌లో సీఎం జగన్‌ గురించి అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కేవీపల్లె మండలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు జి.జయరామచంద్రయ్య ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసులు జడ్జి రామకృష్ణపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 15న ఆయనను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. పీలేరు సబ్‌జైలులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న ఆయనకు మంగళవారం హైకోర్టు షరతులతో   బెయిల్‌ మంజూరు చేసింది.