వలస కూలీల కోసం ముందుకొచ్చిన జడ్జీలు

ABN , First Publish Date - 2020-05-30T21:32:59+05:30 IST

వలస కూలీల కోసం జడ్జీలు ముందుకొచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసి.. వలస కూలీలకి సేవలు అందిస్తూ జడ్డీలు మానవత్వం చాటుతున్నారు.

వలస కూలీల కోసం ముందుకొచ్చిన జడ్జీలు

నెల్లూరు: వలస కూలీల కోసం జడ్జీలు ముందుకొచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసి.. వలస కూలీలకి సేవలు అందిస్తూ జడ్డీలు మానవత్వం చాటుతున్నారు. కొన్నిరోజులుగా రెడ్‌క్రాస్‌తో కలిసి కూలీలకు భోజనం, వసతి రవాణా సౌకర్యాలను జిల్లా జడ్జి జీవీ కృష్ణయ్య, సివిల్‌ జడ్జి సుధా కల్పిస్తున్నారు.


లాక్‌డౌన్‌తో ఇళ్ళలో ఉండలేక జనం ఒకరకంగా అవస్థ పడుతూ ఉంటే, ఇళ్లే లేనివారి సమస్యలు ఇంకో రకంగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచీ, వివిధ జిల్లాల నుంచీ అనేక పనుల కోసం జిల్లాలో ఉన్న వేలాది మంది వలస కూలీలు విలవిల లాడుతున్నారు. అటు సొంత ఊళ్లకు వెళ్ళలేక, ఉన్నా పనుల్లేక పస్తులపాలవుతున్నారు. ఎందరో దాతలు ముందుకొచ్చి ఆహార పొట్లాలు అందిస్తున్నారు. అంతేకాదు కూలీలను వారి గమ్య స్ధానాలకు చేర్చుతున్నారు.

Updated Date - 2020-05-30T21:32:59+05:30 IST