న్యాయశాఖ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2022-01-26T05:27:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రివర్స్‌ పీఆర్‌సీ జీవోలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయశాఖ ఉద్యోగులు ఆందోళన చేశారు.

న్యాయశాఖ ఉద్యోగుల నిరసన
న్యాయశాఖ ఉద్యోగుల నిరసన

 రాజమహేంద్రవరం సిటీ, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రివర్స్‌ పీఆర్‌సీ జీవోలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయశాఖ ఉద్యోగులు ఆందోళన చేశారు.  రాజమహేంద్రవరం జిల్లా కోర్డు ఆవరణంలో ఉన్న జ్యూడిషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద మంగళవారం   నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఏబీఎన్‌ జనార్ధనరావు (జానీ), మహ్మద్‌ ఇజాజ్‌, జీవీవీ సత్యనారాయణ(జీవీ) మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్‌సీతో ఉద్యోగులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ను కొనసాగించాలని, క్వాంటం పెన్షన్‌ విధానం పాతదే అమలు చేయాలని, ప్రతి ఐదేళ్లకు పీఆర్‌సీ ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంపాయీస్‌ను రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండ్‌లతో చేపట్టిన సమ్మెను విజయవంతం చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు నష్టం కలిగించే విధానాలను ప్రభుత్వం విడనాడాలని డిమాండ్‌ చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు పి.సూర్యనారాయణ, ఎంఎస్‌ఎల్‌ ప్రసాద్‌కుమార్‌, నాజర్‌, వీవీ వెంకటాచారి, ఎంవీ వెంకటరమణ, పి.భాస్కరరావు, పాపిరెడ్డి, యు.నరేష్‌, శ్యామలరావు, శ్రీలక్ష్మి, దుర్గ, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:27:37+05:30 IST