Abn logo
Jul 13 2020 @ 23:24PM

అది టైపో ఎర్రర్ కాదు: ‘బిగ్ బి’ ట్వీట్‌పై జూహి చావ్లా వివరణ

బిగ్ బి అమితాబచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తెలియగానే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు ఒక్కసారిగా మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నట్లుగా ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ నటి జూహి చావ్లా కూడా అలాగే ట్వీట్ చేశారు కానీ ఆమె ‘అమిత్‌జీ, అభిషేక్.. ఆయుర్వేద..’’ అంటూ మెన్షన్ చేశారు. అమితాబ్ మనవరాలి పేరు ఆరాధ్య అయితే ఆమె ఆయుర్వేద అని ట్వీట్ చేయడంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దీంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన జూహి చావ్లా.. మరో ట్వీట్ చేసింది.


రెండో సారి చేసిన ట్వీట్‌లో ‘‘అమిత్‌జీ, అభిషేక్, ఐశ్వర్య మరియు ఆరాధ్య.. మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్ టైపో ప్రాబ్లమ్ కాదు. నేను ఆయుర్వేద అని రాయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం.. ప్రకృతి దయతో త్వరగా కోలుకుంటారని..’’ అని జూహి చావ్లా ఈ ట్వీట్‌లో పేర్కొంది.


Advertisement
Advertisement
Advertisement