Abn logo
May 24 2020 @ 00:00AM

ఆ సంగతి రైతులకే బాగా తెలుసు

‘‘రైతులకు సాయపడాలనుకోవడం లాక్‌డౌన్‌ సమయంలో నాకు వచ్చిన మంచి ఆలోచన అనుకుంటున్నాను. నగరవాసులకు పుస్తక జ్ఞానమే ఉంటుంది. అదే రైతులకు అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలుసు’’ అంటున్నారు బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు వివిధ రకాలుగా చేసిన సాయం చూశాం. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన ఈ అందాల రాణి రైతులకు సాయపడడమే కాకుండా వారికి ఉపాధి సైతం కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో భూమిలేని నిరుపేద రైతులకు తన ఫార్మ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచ్చి గొప్ప మనసును చాటుకుంటున్నారు. 


భూమిలేని నిరుపేద రైతుల కష్టాలను చూసి చలించిన జుహీ మహారాష్ట్రలోని మాండ్వా, వాడా ప్రాంతాల్లో ఉన్న తమ ఫార్మ్‌హౌస్‌లలో పొలాన్ని   సేంద్రియ పద్ధతుల్లో వరిని సాగు కోసం రైతులకు ఇచ్చారు. వారికి ఆశ్రయం, నిత్యావసరాలు అందించారు. ‘‘నేల, మట్టి, గాలి, నీరు గురించి వారికి మనకన్నా ఎక్కువ తెలుసు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వారిని సేంద్రియ సేద్యం చేయమని చెప్పాను. దీనివల్ల మాకూ, రైతు కుటుంబాలకు ఉపయోగం ఉంటుంది’’ అని అంటున్నారామె. తమ ఫార్మ్‌హౌస్‌లో జూహీ భర్త జె మెహతాకు రెస్టారెంట్లు ఉన్నాయి. వాటికి అవసరమైన కూరగాయలను ఈ దంపతులు చాలా సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement