Abn logo
Oct 1 2020 @ 10:07AM

నా సినిమాలు చూడడానికి నా పిల్లలు ఇబ్బందిపడతారు: జుహీ చావ్లా

Kaakateeya

జుహీ చావ్లా.. గతంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన కథానాయిక. బాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించి గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన జుహీ చావ్లా తన పిల్లల గురించి మాట్లాడింది. 


`నా పిల్లలు జాహ్నవి, అర్జున్ నా సినిమాలు చూడడానికి ఇబ్బందిపడతారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో నేను చేసిన సినిమాలు వాళ్లు అసలు చూడరు. నేను నటించిన రొమాంటిక్ సినిమాలు చూడడానికి అర్జున్ అయితే అసలు ఇష్టపడడు. ఒకవేళ ఏదైనా చూడాలనుకుంటే.. ముందుగానే `అమ్మా అందులో రొమాంటికి సీన్లు ఉంటాయా` అని అడుగుతాడు. నిన్ను రొమాంటిక్ సీన్లలో చూడడం నాకు నచ్చదని చెబుతుంటాడ`ని జుహీ వెల్లడించింది.  

Advertisement
Advertisement
Advertisement