Abn logo
Sep 25 2021 @ 23:32PM

కూతురి పెళ్లి కోసం బ్రోకర్ వద్దకు వెళ్లిన ఓ తండ్రికి షాకింగ్ అనుభవం.. నెలకు 15 ప్రొఫైల్స్ తెస్తానని..

ముంబై: పెళ్లిళ్లు కుదురుస్తానంటూ యువతీయువకుల తల్లిదండ్రులకు టోకరా ఇచ్చిన ఓ మహిళకు ముంబైలోని కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బాధితుడికి రూ. 5 వేలు పరిహారం చెల్లించాలంటూ తాజాగా తీర్పు వెలువరించింది. అంతేకాకుండా.. పెళ్లి సంబంధాలు కుదిర్చేందుకు ఆయన నుంచి తీసుకున్న రూ. 55 వేలను కూడా తిరిగిచ్చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని పరేల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెకు పెళ్లి సంబంధం వెతికే క్రమంలో ప్రియా షా అనే పెళ్లిళ్ల బ్రోకర్‌ను 2012లో సంప్రదించారు. అప్పట్లో ప్రియా.. ఉన్నతస్థాయి కుంటుంబాలకు, ఎన్నారైలకు తగిన సంబంధాలు కుదురుస్తానంటూ ఇచ్చిన ప్రకటన ఆధారంగా ఆమెను కలిశారు. నెలకు కనీసం 15 సంబంధాలు చూపిస్తానని కూడా ప్రియా అప్పట్లో బాధితుడికి వాగ్దానం చేసింది. 

ఈ క్రమంలో ప్రియ కోరినట్టు ఆయన 55 వేల రూపాయలకు ఓ చెక్కు కూడా ఇచ్చారు. డబ్బు అందిన తరువాత.. ప్రియా షా ఆశించిన స్థాయిలో స్పందించలేదు. దీంతో ఆయన షాకైపోయాడు. చివరికి తమ మధ్య కుదిరిన అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నట్టు లీగల్ నోటీసులు పంపించారు. తాను ఇచ్చిన డబ్బును కూడా తిరిగివ్వాలని కోరాడు. కానీ..ప్రియ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఆయన చివరకు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. కేసు విచారించిన ఫోరం..తమ ముందు హాజరుకావాలంటూ ప్రియను ఆదేశించింది. ఈ ఆదేశాలను ఆమె బేఖాతరు చేయడంతో..అన్ని ఆధారాలు పరిశీలించిన ఫోరం చివరికి ఎక్స్ పార్టీగా ఈ ఆదేశాలు జారీ చేసింది.  

ప్రత్యేకంమరిన్ని...