నీళ్ల గ్లాసుతో జంప్‌ చేసి చూడు!

ABN , First Publish Date - 2020-06-25T05:30:00+05:30 IST

సరదాగా ఉండాలంటే ఈ గేమ్‌ను ప్రయత్నించండి. రెండు టీమ్‌లుగా విడిపోయి ఈ ఆట ఆడుకోవచ్చు...

నీళ్ల గ్లాసుతో జంప్‌ చేసి చూడు!

సరదాగా ఉండాలంటే ఈ గేమ్‌ను ప్రయత్నించండి. రెండు టీమ్‌లుగా విడిపోయి ఈ ఆట ఆడుకోవచ్చు. 


  1. ఒక్కో టీమ్‌ ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకోవాలి.
  2. ఒక టీమ్‌ సభ్యులిద్దరూ తాడు పట్టుకుని తిప్పుతూ ఉండాలి. స్కిప్పింగ్‌ చేసే సమయంలో తాడును ఎలా తిప్పుతారో అలా ఇద్దరూ దూరంగా నిలబడి తాడును తిప్పాలి.
  3. ఆ తాడు పైనుంచి మరో టీమ్‌ సభ్యుడు చేతిలో నీళ్ల గ్లాసు పట్టుకొని  దూకాలి.
  4. గ్లాసులో నీళ్లు కింద పడిపోకుండా చూసుకోవాలి.
  5. ఈ ఆటకు కొన్ని రౌండ్స్‌ పెట్టుకోవాలి. ఒక రౌండ్‌ నాలుగు లేదా ఐదు జంప్‌లు చేయాలి. మొత్తం రౌండ్స్‌ పూర్తయ్యాక ఎవరి గ్లాసులో ఎక్కువ నీళ్లు ఉంటే వాళ్లు గెలిచినట్టు!

Updated Date - 2020-06-25T05:30:00+05:30 IST