Telugu జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం.. భర్తకు విడాకులిచ్చేలా చేసి.. ఆమెతో సహజీవనం.. పిల్లాడు కూడా.. మరొకరితో పెళ్లి.. చివరికి..!

ABN , First Publish Date - 2021-11-13T20:25:54+05:30 IST

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి..

Telugu జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం.. భర్తకు విడాకులిచ్చేలా చేసి.. ఆమెతో సహజీవనం.. పిల్లాడు కూడా.. మరొకరితో పెళ్లి.. చివరికి..!

హైదరాబాద్ సిటీ : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్‌నగర్‌కు చెందిన యువతి(26) జూనియర్‌ ఆర్టిస్ట్‌. తనకు వివాహమైంది. ఐదేళ్ల క్రితం ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమె భర్తకు విడాకులు ఇచ్చేలా చేశాడు. రహ్మత్‌నగర్‌లో ఓ గది తీసుకొని సహజీవనం మొదలుపెట్టాడు. వారికి ఓ కుమారుడూ పుట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తెస్తున్నా పట్టించుకోలేదు. ప్రసాద్‌రెడ్డి గతేడాది మరో యువతిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. ఆమెను వదిలించేందుకు ప్రసాద్‌రెడ్డి మానసికంగా వేధించడం మొదలు పె ట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-11-13T20:25:54+05:30 IST