జూనియర్‌ క్లబ్‌ క్రికెట్‌ ఆగయా..!

ABN , First Publish Date - 2020-08-02T09:16:21+05:30 IST

విదేశాల్లో ఉన్న జూనియర్‌ క్లబ్‌ క్రికెట్‌ మోడల్‌.. ఇక భారత్‌లోనూ ప్రారంభం కానుంది. లండన్‌కు చెందిన సెవెన్‌ త్రీ స్పోర్ట్స్‌ సంస్థ ఈ ...

జూనియర్‌ క్లబ్‌ క్రికెట్‌ ఆగయా..!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): విదేశాల్లో ఉన్న జూనియర్‌ క్లబ్‌ క్రికెట్‌ మోడల్‌.. ఇక భారత్‌లోనూ ప్రారంభం కానుంది. లండన్‌కు చెందిన సెవెన్‌ త్రీ స్పోర్ట్స్‌ సంస్థ ఈ జూనియర్‌ క్లబ్‌ క్రికెట్‌ వ్యవస్థను మన దగ్గర ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తొలిదశలో దేశవ్యాప్తంగా 65 క్లబ్‌లు ఏర్పాటు చేసి జూనియర్‌ క్రికెట్‌ చాంపియన్‌షి్‌పను నిర్వహించనుంది. ఈ క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించాలనుకునే 8 నుంచి 18 ఏళ్ల వారికి విభాగాల వారీగా సెలెక్షన్స్‌ నిర్వహించనుంది. ఈ టాలెంట్‌ హంట్‌ ద్వారా ప్రతిభగల వారిని గుర్తించి అవకాశం ఇవ్వనున్నారు. ఈ కార్యకలాపాలను సెంట్రల్‌ జోన్‌ మెంటర్‌గా మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ, సౌత్‌జోన్‌ మెంటర్‌గా సునీల్‌ బాబు పర్యవేక్షించనున్నారు. మరిన్ని వివరాలకు జ్ట్టిఞట://్జఛిఛిజీుఽఛీజ్చీ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

Updated Date - 2020-08-02T09:16:21+05:30 IST