Arrested :జూనియర్ ఇంజినీర్ పుట్టినరోజు వేడుకల కోసం మహిళ చెవిరింగుల చోరీ

ABN , First Publish Date - 2021-07-28T17:14:38+05:30 IST

తన పుట్టినరోజు వేడుకల కోసం ఓ జూనియర్ ఇంజినీరు మహిళ చెవిరింగులను చోరీ చేసిన ఘటన...

Arrested :జూనియర్ ఇంజినీర్ పుట్టినరోజు వేడుకల కోసం మహిళ చెవిరింగుల చోరీ

న్యూఢిల్లీ : తన పుట్టినరోజు వేడుకల కోసం ఓ జూనియర్ ఇంజినీరు మహిళ చెవిరింగులను చోరీ చేసిన ఘటన ఢిల్లీలో తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీలోని షాహదారాలోని జ్యోతినగర్ నివాసి అయిన మోహిత్ గౌతమ్ అలియాస్ లవ్ (31) జూనియర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. గౌతమ్ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు బైక్ పై వస్తూ మానససరోవర్ పార్కు వద్ద ఓ మహిళ చెవిరింగులను లాక్కెళ్లాడు. పోలీసులు 30 సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేయగా రింగ్ స్నాచర్ తప్పించుకున్న ఫుటేజీ లభించింది. 


నంబరు ప్లేటు లేని వాహనాన్ని గుర్తించి గౌతమ్ ను పోలీసులు పట్టుకున్నారు. విచారణ సమయంలో తాను బీఎస్ఈఎస్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ ఇంజినీరుగా పనిచేస్తున్నానని, తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు మహిళ చెవి రింగులను లాక్కున్నట్లు నిందితుడు గౌతమ్ చెప్పాడు.చోరీ చేసిన చెవిరింగులను అశోక్ నగర్ లోని సురేందర్ కు విక్రయించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు నిందితుడు గౌతమ్ ను అరెస్టు చేశారు.

Updated Date - 2021-07-28T17:14:38+05:30 IST