Junior Hockey World Cup: అమెరికా టీంలో ఐదుగురు భారతీయ సంతతి క్రీడాకారులు..!

ABN , First Publish Date - 2021-11-20T04:10:58+05:30 IST

ఈ నెలలో జరగబోయే పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ దేశాల జాతీయ టీంలు భారత్‌కు వస్తున్నాయి.

Junior Hockey World Cup: అమెరికా టీంలో ఐదుగురు భారతీయ సంతతి క్రీడాకారులు..!

ఇంటర్నెట్ డెస్క్: ఈ నెలలో జరగబోయే పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ దేశాల జాతీయ టీంలు భారత్‌కు వస్తున్నాయి. ఈ మారు ఇండియానే కప్ ఎగరేసుకుపోతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం అమెరికా హాకీ టీం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం.. ఆ టీంలో ఏకంగా ఐదుగురు భారత సంతతి క్రీడాకారులు ఉండటమే. జతిన్ శర్మ, మెహ్తాబ్ గ్రేవాక్, గురుచరణ్ జోహాల్, అమరీందర్ పాల్ సింగ్, షోమిక్ చక్రబర్తీ ఈ మారు అమెరికా జూనియర్ హాకీ పురుషుల జట్టులో స్థానం సంపాదించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత జూనియర్ హాకీ టీమ్‌కు గతంలో కోచ్‌గా వ్యవహరించిన హరేంద్ర సింగ్..అమెరికా టీంకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2021-11-20T04:10:58+05:30 IST