Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ జోరు సాగాలని..

జర్మనీతో భారత్‌ సెమీస్‌ పోరు నేడు

జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో


భువనేశ్వర్‌: వరుసగా రెండోసారి జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌ టైటిల్‌ను ముద్దాడాలనుకుంటున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ మరో హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఆరుసార్లు చాంపియన్‌ జర్మనీతో  అమీతుమీ తేల్చుకోనుంది. అటాకింగ్‌తోపాటు డిఫెన్స్‌లోనూ భారత్‌ బలంగా కనిపిస్తోంది.


లీగ్‌ దశలో ఫ్రాన్స్‌ చేతిలో కంగుతిన్నా.. ఆ తర్వాత టీమిండియా  పుంజుకొంది. క్వార్టర్స్‌లో బెల్జియంపై ఒక్క గోల్‌తో గెలిచినా.. వ్యూహచతురతను ప్రదర్శించింది. సెమీ్‌సలోనూ అలాంటి ఆటతోనే జర్మనీ పని పట్టాలనుకుంటోంది. డ్రాగ్‌ఫ్లికర్‌ సంజయ్‌ కుమార్‌పై జట్టు ఎంతో ఆధారపడింది. మరోవైపు స్పెయిన్‌ను షూటౌట్‌ చేసిన జర్మనీ మరోసారి టైటిల్‌పై కన్నేసింది. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగే సత్తా ఆ జట్టుకు ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరో సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో అర్జెంటీనా తలపడనుంది. 

Advertisement
Advertisement