Jun 17 2021 @ 20:50PM

అంజలి కాదు.. కోలీవుడ్‌లో జూనియర్‌ రంభ!

దిగ్గజ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన చిత్రం ‘అన్నక్కొడి’. ఈ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది సుభిక్ష. ఈ చిత్రం తర్వాత ‘గోలిసోడా-2’, ‘కడుగు’, ‘యార్‌ ఇవర్‌గళ్‌’ వంటి చిత్రాల్లో నటించింది. గత యేడాది హీరో శిలంబరసన్‌ టీఆర్‌తో ప్రేమలో మునిగితేలుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పుకార్ల నుంచి ఆమె బయటపడింది. అదేసమయంలో విభిన్నమైన కథాంశాలతో కూడిన చిత్రాలను ఎంచుకుని తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. అదేసమయంలో ప్రత్యేక ఫొటోషూట్‌లలో పాల్గొంటోంది.


ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కోతులు, పిల్లులు, శునకాలు వంటి మూగజీవుల ఆకలితీర్చి అనేక మందితో శభాష్‌ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా అందాలను ఆరబోస్తూ ఆమె దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సీనియర్‌ హీరోయిన్‌ రంభతో పోల్చారు. ముఖ్యంగా హీరోయిన్‌ అంజలిలా ఉన్న సుభిక్ష త్వరలోనే రంభ స్థానాన్ని భర్తీ చేస్తుందంటూ కామెంట్స్‌ చేశారు. అదేసమయంలో ఈమెను దర్శకనిర్మాతలు చూస్తే మాత్రం ఖచ్చితంగా తమ చిత్రాల్లో నటించేంతవరకు వదిలిపెట్టరంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.