Abn logo
Sep 13 2021 @ 08:15AM

Telangana: జూరాల ఇన్‌ఫ్లో 73,000 క్యూసెక్కులు

మహబూబ్‌నగర్: జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 318.230 మీటర్లుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను, ప్రస్తుతం నీటి నిల్వ 9.070 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో 73,000 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 62,658 క్యూసెక్కులుగా ఉంది. దిగువకు శ్రీశైలం వైపు 60,846 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.