Abn logo
Sep 19 2021 @ 20:23PM

జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో

ధరూరు: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ జలాశయాల నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 63,396 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో మూడు గేట్లను ఎత్తి నీటి విడుదల కొనసాగించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 318.340 మీటర్లలో 9.296 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జలవిద్యుత్‌ కేంద్రం వద్ద 35,959 క్యూసెక్కులతో రెండు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, కుడి కాల్వకు 672 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 60,605 క్యూసెక్కులు నీరు ఔట్‌ఫ్లోగా నమోదవుతోంది.

ఇవి కూడా చదవండిImage Caption