3 రోజుల్లో 7 వేల మాస్క్‌లు... ఖైదీలకు ఎంత ముడుతుందంటే...

ABN , First Publish Date - 2021-04-20T13:39:52+05:30 IST

దేశమంతా కరోనాతో పోరాడుతోంది. ఈ పోరాటంలో...

3 రోజుల్లో 7 వేల మాస్క్‌లు... ఖైదీలకు ఎంత ముడుతుందంటే...

మీరఠ్: దేశమంతా కరోనాతో పోరాడుతోంది. ఈ పోరాటంలో మాస్క్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీరఠ్ జిల్లా కారాగారంలో ఉంటున్న ఖైదీలు కరోనాపై పోరాటంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఏకంగా ఏడువేల మాస్కులు తయారు చేసి, సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ పనిలో మొత్తం 40 మంది ఖైదీలు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా జైలు అధికారి పాండే మాట్లాడుతూ జైలులో మాస్క్‌లను యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తున్నామన్నారు. 


15 నుంచి 15 వేల మాస్కులు తయారు చేసి రిజర్వులో ఉంచాలని నిర్ణయించామన్నారు. కాటన్‌తో తయారు చేసిన ఈ మాస్కులో మూడు లేయర్లు ఉంటాయని తెలిపారు. అలాగే ఈ మాస్కులను శానిటైజ్ చేసి, ప్యాక్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఒక్కో ఖైదీ రోజుకు 125 మాస్కులు వరకూ తయారు చేస్తుంటారని, ఒక్కో మాస్క్ తయారీకి ఒక రూపాయి చొప్పున ఇస్తామని తెలిపారు. కొంతమంది ఖైదీలు కాటన్ వస్త్రాన్ని కట్ చేస్తారని, మరికొందరు మాస్క్‌లను కుడతారని అన్నారు. ఒక మాస్క్ తయారీకి ఎనిమిది రూపాయల వరకూ ఖర్చవుతుందని, ఈ మాస్క్‌లను ఉతికి కూడా ఉపయోగించవచ్చని పాండే తెలిపారు. 

Updated Date - 2021-04-20T13:39:52+05:30 IST