జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకం ఓకే

ABN , First Publish Date - 2021-04-10T09:04:41+05:30 IST

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎథిక్స్‌ అధికారి, అంబుడ్స్‌మన్‌గా సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.

జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకం ఓకే

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎథిక్స్‌ అధికారి, అంబుడ్స్‌మన్‌గా సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకాన్ని సవాలు చేస్తూ చార్మినార్‌ క్రికెట్‌ క్లబ్‌ దాఖలు చేసిన రివిజన్‌ పిటిషిన్‌ను జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు శుక్రవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకాన్ని ఆయన సమర్థించారు. 

Updated Date - 2021-04-10T09:04:41+05:30 IST