‘సఖీ కేంద్రంలో మహిళలకు న్యాయం చేయాలి’

ABN , First Publish Date - 2021-01-21T06:21:03+05:30 IST

సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పేర్కొన్నారు.

‘సఖీ కేంద్రంలో మహిళలకు న్యాయం చేయాలి’
పోతిరెడ్డిపల్లిలోని సఖీ కేంద్రంలో కౌన్సిల్‌ సభ్యులతో మాట్లాడుతున్న న్యాయమూర్తి ఆశాలత

 సంగారెడ్డి రూరల్‌, జనవరి 20 : సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పేర్కొన్నారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని సఖీ కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించి కౌన్సిల్‌ సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సఖీ కేంద్రానికి వచ్చే కేసులు పెండింగ్‌లో ఉంచవద్దని, ఇరువురికి కౌన్సెలింగ్‌ ఇచ్చి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, రత్నం, సఖీ కేంద్రం కౌన్సిల్‌ సభ్యులు వసంత, కల్పన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:21:03+05:30 IST