Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్‌ఎంయూతోనే కార్మికులకు న్యాయం

మేనిఫెస్టోను విడుదల చేస్తున్న ఎన్‌ఎంయూ నాయకులు

రాష్ట్ర కార్యదర్శి ముద్దపాటి లక్ష్మీనారాయణ 

ధర్మవరం, డిసెంబరు 2: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేది ఎన్‌ఎంయూతోనే సాధ్యమని రాష్ట్రకార్యదర్శి ముద్దపాటి లక్ష్మీనారాయణ పేర్కొ న్నారు. క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) ఎన్నికలకు ఎన్‌ఎంయూ తరపున జేఎస్‌ రాయుడు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయ నతోపాటు డిపో గౌరవాధ్యక్షుడు డోలారాజారెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌, నాగశేఖర్‌, నాయకులు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత పదేళ్లలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఏకపక్షంగా సంస్థకు, సీసీఎస్‌ సభ్యులకు నష్టం కలిగించేవిధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంస్థ నష్టాలను చవిచూసిందన్నారు. కేవలం ఈయూ స్వార్థప్రయోజనాలకే ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగిందని విమర్శించారు. ఎన్‌ఎంయూ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించడంలో ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూ జోనల్‌ నాయకులు వైజేపీ కుమార్‌, రీజనల్‌ చైర్మన్‌ ముత్యాలప్ప, రీజనల్‌ నా యకులు నీళ్లశంకరయ్య, దుర్గాప్రసాద్‌, ఏఎస్‌రావు, ఎస్‌ఎంసాబ్‌, డిపో నాయ కులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement