జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-10-23T08:02:50+05:30 IST

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ ఆయనతో ప్రమాణ స్వీకా రం చేయించారు. ఇటీవల ఆయన తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో చీఫ్‌ జస్టిస్‌..

జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణ స్వీకారం

  •  హైకోర్టులో నెంబర్‌ టూ స్థానం ఆయనదే


హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ ఆయనతో ప్రమాణ స్వీకా రం చేయించారు.  ఇటీవల ఆయన తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ తర్వాత రెండో స్థానంలో కొనసాగనున్నారు. ఆయన చేరికతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరిగింది. నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు హై కో ర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T08:02:50+05:30 IST