జువెట్‌ చర్చికి నూతన కమిటీని నియమించాలి

ABN , First Publish Date - 2021-01-20T05:30:00+05:30 IST

ఒంగోలులోని జూవెట్‌ మెమోరియల్‌ బాప్టిస్ట్‌ చర్చికి పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని నియమించేలా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు బుధవారం స్థానిక కలె క్టరేట్‌లో డీఆర్వో వినాయకంను కలిసి వినతిపత్రం అందజే శారు.

జువెట్‌ చర్చికి నూతన కమిటీని నియమించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 20 : ఒంగోలులోని జూవెట్‌ మెమోరియల్‌ బాప్టిస్ట్‌ చర్చికి పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని నియమించేలా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు బుధవారం స్థానిక కలె క్టరేట్‌లో డీఆర్వో వినాయకంను కలిసి వినతిపత్రం అందజే శారు. గత మూ డేళ్ల నుంచి చర్చిలోని సభ్యులు గ్రూపులుగా ఏర్పడి ప్రార్ధనలకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేవలం ఈ గోడవలకు కారణం భక్తులు వేసే కానుకలనేనని తెలిపారు. బాప్టిస్టు బైలా ప్రకారం చర్చిలో కమిటీ స భ్యులుగా బీసీ-సీ అయి ఉండాలని, కానీ చాలా మంది ఎస్సీలుగా ఉద్యోగా లు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు కూడా తీసుకున్నారని వివరించారు. కార్యక్రమంలో నాయకులు కొమ్ము సృజ న్‌మాదిగ, తాటిపర్తి వెంకటస్వామి, చప్పిడి వెంగళరావు, కన్నా, కుమార్‌, వెంకటరావు, విజయ్‌శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-20T05:30:00+05:30 IST