Abn logo
Sep 24 2021 @ 03:54AM

క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ

యాంక్టన్‌ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షి్‌ప్స కాంపౌండ్‌ మహిళల  వ్యక్తిగత విభాగంలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పురుషుల్లో అభిషేక్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం ముగిసిన ప్రీక్వార్టర్స్‌లో సురేఖ 146-142 స్కోరుతో కొరి యా ఆర్చర్‌ సో చేవన్‌ను ఓడించగా అభిషేక్‌ 145-142తో జోజెఫ్‌ బొసాన్‌స్కై (స్లొవేకియా)పై నెగ్గి క్వార్టర్స్‌ చేరారు. శనివారం క్వార్టర్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక, మహిళల కాంపౌండ్‌ విభాగంలో ముస్కాన్‌ 139-145తో ఎల్లీసన్‌ (స్లొవేనియా) చేతిలో ఓటమి పాలవగా ప్రియా గుర్జర్‌ 138-141తో అమందా (క్రొయేషియా) చేతిలో పరాజయం పాలై మూడో రౌండ్లో నిష్క్రమించారు. పురుషుల కాంపౌండ్‌ కేటగిరీలో రిషభ్‌ యాదవ్‌, సంగంప్రీత్‌ సింగ్‌ రెండో రౌండ్‌లో వెనుదిరిగారు.