Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్ఫూర్తిప్రదాత జ్యోతిరావు ఫూలే

పాయకాపురం, నవంబరు 28 : మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని చాటి చెప్పిన మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలే అని, ఆయన ఆశయాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ నివాస్‌ చెప్పారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 131వ వర్ధంతి సందర్భంగా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.మోహన్‌ కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సీహెచ్‌ లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

Advertisement
Advertisement