Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు గుండెపోటు

రాజమండ్రి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు గుండెపోటు రావడంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పలువురు టీడీపీ నాయకులు ఆస్పత్రికి వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, వరపుల సుబ్బారావు, గన్ని కృష్ణ, రాజా, ఎస్వీఎస్ అప్పలరాజు తదితరులు జ్యోతుల నెహ్రూను పరామర్శించిన వారిలో ఉన్నారు. నెహ్రూ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement