ప్రమాణం చేస్తా.. ఎమ్మెల్యే కూడా సిద్ధమా?: జోతుల నెహ్రూ

ABN , First Publish Date - 2020-09-21T01:04:18+05:30 IST

తనపై పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణ చంద్ర ప్రసాద్ చేసిన ఆరోపణలు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే జోతుల నెహ్రూ సవాల్ విసిరారు. తన ..

ప్రమాణం చేస్తా.. ఎమ్మెల్యే కూడా సిద్ధమా?: జోతుల నెహ్రూ

తూ.గో.: తనపై పత్తిపాడు ఎమ్మెల్యే  పూర్ణ చంద్ర ప్రసాద్ చేసిన ఆరోపణలు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే జోతుల నెహ్రూ సవాల్ విసిరారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ అవినీతికి  పాల్పడలేదన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని జోతుల నెహ్రూ ప్రకటించారు. ఎమ్మెల్యే పూర్ణ చంద్రప్రసాద్ కూడా సిద్ధమైతే తేదీ, సమయం చెప్పాలని సవాల్ విసిరారు. 

Updated Date - 2020-09-21T01:04:18+05:30 IST