సర్కారుకు జ్యోతిరావు పూలే స్ఫూర్తి: సీఎం

ABN , First Publish Date - 2021-04-11T08:43:30+05:30 IST

వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా ఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

సర్కారుకు జ్యోతిరావు పూలే స్ఫూర్తి: సీఎం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా ఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. జ్యోతిరావు ఫూలే 195వ జయంతిని పురస్కరించుకుని శనివారం కేసీఆర్‌ ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఫూలే అందించిన సవలను స్మరించుకున్నారు. కుల, లింగ వివక్షకు తావు లేకుండా విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే ఫూలే ఆలోచన విధానమే స్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ఆరున్నర ఏండ్ల తెలంగాణ స్వయం పాలనా పక్రియ, ఫూలే వంటి మహనీయుల స్ఫూర్తితోనే కొనసాగుతున్నదని అన్నారు. ఏటా దాదాపు 45 వేల కోట్ల ఖర్చుతో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాల సమున్నతికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. 

Updated Date - 2021-04-11T08:43:30+05:30 IST