Oct 21 2021 @ 15:18PM

K.Raghavendra Rao: పూల కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు

సినిమా ఇండస్ట్రీకి పెద్ద అవసరం లేదు

ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకుంటే చాలు..

పూల కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు..

నాకంటూ శత్రువులు ఉండకూడదు..

ఉచిత సలహాలు ఇవ్వడం నచ్చదు!

– కె.రాఘవేంద్రరావు

సినిమా ఇండస్ర్టీకి పెద్ద అవసరం లేదని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల జరిగిన విధానం, పరిణామాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘చాలామంది ఇండస్ట్రీకి పెద్ద లేరు అంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇండస్ట్రీకి పెద్ద ఉండాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. మన పిల్లలు, మన పక్కన ఉన్నవాళ్లే ఒక్కోసారి చెప్పిన మాట వినరు. మనం చెప్పడం ఎందుకు.. మళ్లీ వినలేదని బాధపడటం ఎందుకు అనిపిస్తుంది. నేను ఫాలో అయ్యే పాలసీ ఒకటే! ఇండస్ట్రీల్లో నాకంటూ ఎవరూ శత్రువులు ఉండకూడదు. ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకూడదు. మనం మంచి కోరి చెప్పినా.. వేరే ఉద్దేశంతో చెబుతున్నారు అనుకునేవారు ఉన్నారు. పైగా మన ఇంట్లోనే విననివారు బయటివాళ్లు వింటారా? అని నాకు అనిపిస్తుంది. మన పిల్లలకి ఇది చెయ్య్‌.. అది చెయ్య్‌ అంటే వాళ్లకి నచ్చిందే చేస్తారు తప్ప... మనం చెప్పింది చేయకపోవచ్చు. ఇండస్ట్రీలో మనకంటూ ఒక గౌరవం ఉన్నప్పుడు దానిని అలా కాపాడుకుంటే చాలు. పూల కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇండస్ట్రీ నాకంటూ ఓ గౌరవం ఇచ్చింది. ఆ గౌరవం అలా కంటిన్యూ అయితే చాలు. మిగతా వాటిలో వేలు పెట్టడం నాకు నచ్చదు’’ అని రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు.