అవద్‌ కీ గలౌటీ కబాబ్‌

ABN , First Publish Date - 2020-11-07T20:45:13+05:30 IST

మన దేశంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో రుచి. హైదరాబాద్‌ అనగానే బిర్యానీ గుర్తొచ్చినట్లే.. లక్నో అనగానే కబాబ్‌లు నోరూరిస్తాయి. వీటితో పాటు ఇంకొన్ని ప్రత్యేక రుచులు కూడా ఈ ప్రాంతాల సొంతం. అలాంటి నాలుగు నాన్‌వెజ్‌ రుచులను

అవద్‌ కీ గలౌటీ కబాబ్‌

ఆహా ఏమి రుచి...

మన దేశంలో ఒక్కో  ప్రాంతానిది ఒక్కో రుచి. హైదరాబాద్‌ అనగానే బిర్యానీ గుర్తొచ్చినట్లే.. లక్నో అనగానే కబాబ్‌లు నోరూరిస్తాయి. వీటితో పాటు ఇంకొన్ని ప్రత్యేక రుచులు కూడా ఈ ప్రాంతాల సొంతం. అలాంటి నాలుగు నాన్‌వెజ్‌ రుచులను ఓహ్రీ రెస్టారెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ విక్రమ్‌ సింహ మీ కోసం అందిస్తున్నారు..


కావలసినవి: మటన్‌ (బోన్‌లెస్‌) - ఒకకేజీ, ఉల్లిపాయలు - 200గ్రా, వెల్లుల్లి పేస్టు - 100గ్రా, సెనగపిండి - పావుకేజీ, పచ్చి బొప్పాయి పేస్టు - 40గ్రా, గరంమసాలా - 20గ్రా, జీడిపప్పు - 30గ్రా, వేగించిన పుట్నాల పొడి - 25గ్రా, మైదా - 75గ్రా, ఉప్పు - రుచికి తగినంత, లవంగాలు - 10గ్రా, నెయ్యి - 200ఎంఎల్‌, కశ్మీరీ కారం - 50గ్రా, కుంకుమపువ్వు - 2గ్రాములు.


తయారీ విధానం: మటన్‌ను శుభ్రంగా కడిగి మీట్‌ గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత అందులో వెల్లుల్లి పేస్టు, పుట్నాల పొడి, గరంమసాలా, తగినంత ఉప్పు, కారం, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ, జీడిపప్పును పేస్టు చేసి వేయాలి. ఇప్పుడు పచ్చి బొప్పాయి పేస్టు, లవంగాల పొడి వేసి బాగా కలియబెట్టుకోవాలి. నెయ్యి రాసిన కవర్‌ కప్పి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత మటన్‌ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న వడల మాదిరిగా ఒత్తుకుని రెండు వైపులా(గ్రిల్‌) కాల్చాలి. షెర్మన్‌తో వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


పచ్చి బొప్పాయిలో

క్యాలరీలు 43

ఫ్యాట్‌ 0.3గ్రా

ప్రొటీన్‌ 0.5గ్రా

కార్బోహైడ్రేట్లు 11గ్రా



Updated Date - 2020-11-07T20:45:13+05:30 IST