Advertisement
Advertisement
Abn logo
Advertisement

కబాబ్స్‌

కావలసినవి: మినుములు - రెండు  కప్పులు, కారం - ఒక టీస్పూన్‌, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - పావు టీస్పూన్‌, వేగించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, కొత్తిమీర - కొద్దిగా, కొబ్బరితురుము - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా మినుములు రాత్రి నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినుములలో నుంచి నీళ్లను తీసివేసి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కారం, మామిడికాయ పొడి, గరంమసాల, జీలకర్రపొడి, కొబ్బరితురుము, కొత్తిమీర తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కబాబ్‌లుగా చేసుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. సాస్‌ లేదా చట్నీతో వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

వెజ్ స్ప్రింగ్ రోల్స్సొరకాయ దోశమంగళూరు బోండాఆమ్లా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కట్‌లెట్‌మెంతి పకోడీపెరుగు ఇడ్లీక్రిస్పీ కార్న్‌కొత్తిమీర వడలువేరుశనగల చాట్‌దోశ
Advertisement