Abn logo
Sep 27 2021 @ 22:22PM

ముగిసిన కబడ్డీ పోటీలు

లక్షెట్టిపేటలో కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి షీల్డు ప్రధానం చేస్తున్న కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, సెప్టెంబరు 27: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కబడ్డీ పోటీలు ఆదివా రం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో లక్షెట్టిపేటకు చెందిన భజరంగ్‌ జట్టు మొదటి స్థానంలో, రెండో స్థానంలో దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన మథర్‌థెరిస్సా, మూడో స్థానంలో ఆసిఫాబాద్‌కు చెందిన గోండ్వానా పంజా టీం, నాలుగవ స్ధానం లో  ఆదిలాబాద్‌ జట్లు గెలిచాయి. బహుమతుల ప్రధానోత్సవానికి మాజీ ఎంఎల్‌ సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు హాజరై ప్రథమ విజేతకు రూ. 50 వేలు, ద్వితీయ రూ. 30 వేలు, తృతీయ రూ.20 వేలు, నాలుగవ స్ధానంలో నిలిచిన జట్టుకు రూ.10 వేల నగదుతోపాటు మెమోంటో లను అందజేశారు. యువకులను ప్రోత్సహించడా నికి మండల యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కబ డ్డీ పోటీలు నిర్వహించడంపై యువకులను అభి నందించారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. పట్టణ కాంగ్రెస్‌ అధ్య క్షుడు ఎండీ ఆరీఫ్‌, జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అ శోక్‌కుమార్‌, కౌన్సిలర్లు, నిర్వహకులు పాల్గొన్నారు.