భవానీపురం, జనవరి 20 : కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 68వ అంతర్ జిల్లాల మహిళలు, పురుషుల కబడ్డీ జిల్లాజట్ల ఎంపిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుఽధవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 60 మంది పురుషులు, 25 మంది మహిళలు పాల్గొన్నారు. పురుషుల జట్టులో ఎన్.నాగార్జున, సీహెచ్ చిన వెంకటేశ్వరరావు, బి.పవన్‌కుమార్, కె.మహేశ్, ఎస్.దుర్గాప్రసాద్, సీహెచ్ దేవేంద్ర, పి.ఉపేంద్ర, వి.పూర్ణచంద్రరావు, బి.అయ్యప్ప, టి.ఆగర్స్, ఎన్.వంశీ, ఎం.వెంకట రామకృష్ణ, స్టాండ్ బైలుగా ఎ.హరి, డి.సురేష్, ఎం.యుగేష్, మహిళా జట్టులో సీహెచ్ హారిక, ఎం.వీరకుమారి, బి.దుర్గాభవానీ, జి.హరిత, జీఎన్వీ శివమణి, ఎ.లీలారాణి, డి.దుర్గాదేవి, కె.సత్య, సీహెచ్ లక్ష్మీభవానీ, డి.సువర్చనభాయి, ఎం.స్రవంతి, జి.కీర్తి, స్టాండ్ బైలుగా బి.ధనలక్ష్మి, పి.పావని ఎంపికయ్యారు. ఈ జట్లు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు విశాఖ జిల్లా చోడవరం మండలం వెంకుపాలెంలో జరిగే టోర్నీలో పాల్గొంటాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యోనా రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.