Advertisement
Advertisement
Abn logo
Advertisement

కబడ్డీ విజేత ఎస్‌వీఎస్‌ఎస్‌ జట్టు

పలాస రూరల్‌: జిల్లాస్థాయి ఆహ్వానిత  కబడ్డీ పోటీల విజేత గా  శ్రీవివేకానంద సేవా సమితి (ఎస్‌వీఎస్‌ఎస్‌) జట్టు నిలిచింది. సోమవారం రాత్రి బొడ్డపాడు జైభీ మ్‌ యువజన సంఘం 28వ వార్షి కోత్సవం పురస్కరించుకొని నిర్వ హించిన జిల్లా స్థాయి కబడ్డీ పో టీలు ముగిశాయి.ఈ సందర్భంగా రన్నర్‌గా శ్రీకాకుళం,  మామిడిపల్లి-బహడాపల్లి జట్టు తృతీయ స్థానం దక్కించుకున్నాయి. బెస్ట్‌ రైడర్‌గా కె.తేజ(శ్రీకాకుళం జట్టు), బెస్ట్‌ డిఫెండర్‌గా రాపాక నవీన్‌ (ఎస్‌వీఎస్‌ఎస్‌ జట్టు) నిలిచారు. అనంతరం బొడ్డపాడుకు చెందిన సీనియర్‌ కబడ్డీ క్రీడాకారులను జైభీమ్‌ సంఘం తరపున సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సెక్రటరీ చిరంజీవి, జైభీమ్‌ యువజన సంఘం అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, తామాడ త్రిలోచనరావు, దుష్యంత్‌, సార జోగారావు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement