Kabul: డ్రోన్ దాడి పొరపాటు...యూఎస్ మిలటరీ కమాండర్ క్షమాపణలు

ABN , First Publish Date - 2021-09-18T15:37:18+05:30 IST

అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలో తాము జరిపిన డ్రోన్ దాడి తమ తప్పిదమని అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ శనివారం క్షమాపణలు చెప్పారు....

Kabul: డ్రోన్ దాడి పొరపాటు...యూఎస్ మిలటరీ కమాండర్ క్షమాపణలు

వాషింగ్టన్ (అమెరికా): అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలో తాము జరిపిన డ్రోన్ దాడి తమ తప్పిదమని అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ శనివారం క్షమాపణలు చెప్పారు. కాబూల్ నగర విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని, గత నెలలో కాబూల్‌లో అమెరికన్ దళాలు జరిపిన డ్రోన్ దాడి పొరపాటని అమెరికా మిలటరీ అంగీకరించింది. ఈ డ్రోన్ దాడిలో ఏడుగురు చిన్నారులతో సహా 10 మంది పౌరులు మరణించారు.‘‘ డ్రోన్ దాడి చేయడం పొరపాటు, దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. పోరాట కమాండర్‌గా ఈ విషాద ఫలితానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను’’ అని పెంటగాన్ వార్తా సమావేశంలో ఫ్రాంక్ మెకెంజీ విలేకరులతో చెప్పారు.మరణించిన వారి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మెకెంజీ పేర్కొన్నారు.


Updated Date - 2021-09-18T15:37:18+05:30 IST