Sep 18 2021 @ 18:58PM

ఉపేంద్ర ‘కబ్జా’ మోషన్ పోస్టర్ విడుదల

ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా ఎస్‌ఎస్ఈ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎమ్‌టిబి నాగరాజు సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఆర్ చంద్రశేఖర్ నిర్మాత. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను దర్శకనిర్మాతలు విడుదల చేశారు. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఉపేంద్ర పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. చేతిలో కత్తి పట్టుకుని ఉపేంద్ర ఇచ్చిన లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవి బసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్ర టీజర్‌ని దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.