కచ్చీ ఘోష్‌ బిర్యానీ

ABN , First Publish Date - 2021-04-10T19:38:05+05:30 IST

కొవిడ్‌ రెండో దశ తీవ్రమవుతున్న ఈ సమయంలో ప్రోటీన్‌ ఫుడ్‌ తినడం ఎంతో మేలని వైద్యులు అంటున్నారు. రంజాన్‌ మాసం కూడా ప్రారంభం అవుతుండడంతో హలీం ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. మరి ఇంట్లోనే ప్రోటీన్‌ అధికంగా లభించే హలీం, కచ్చీ ఘోష్‌ బిర్యానీ, షీర్‌ కుర్మా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

కచ్చీ ఘోష్‌ బిర్యానీ

రంజాన్‌ రుచులివిగో

కొవిడ్‌ రెండో దశ తీవ్రమవుతున్న ఈ సమయంలో ప్రోటీన్‌ ఫుడ్‌ తినడం ఎంతో మేలని వైద్యులు అంటున్నారు. రంజాన్‌ మాసం కూడా ప్రారంభం అవుతుండడంతో హలీం ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. మరి ఇంట్లోనే ప్రోటీన్‌ అధికంగా లభించే హలీం, కచ్చీ ఘోష్‌ బిర్యానీ, షీర్‌ కుర్మా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.


మటన్‌ బిర్యానీలో...

క్యాలరీలు - 141

ప్రోటీన్‌ - 5.84గ్రా

ఫ్యాట్‌ - 4.34గ్రా

కార్బోహైడ్రేట్లు - 19.26గ్రా


కావలసినవి: బాస్మతి బియ్యం - ఒక కేజీ, మటన్‌ - ఒక కేజీ, పెరుగు - 200గ్రా, నిమ్మకాయలు - మూడు, కారం - 50గ్రా, ధనియాలపొడి - 50గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా, ఉప్పు - 50గ్రా, నూనె - 100ఎంఎల్‌, ఉల్లిపాయలు - 200గ్రా, కొత్తిమీర - 15గ్రా,  పుదీనా - 15గ్రా, బిర్యానీ ఆకు - 5గ్రా, డాల్డా - 15గ్రా, పచ్చిమిర్చి - 100గ్రా, గరంమసాలా - 30గ్రా, నెయ్యి - 200గ్రా.


తయారీ విధానం: మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు, గరంమసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాలపొడి, నూనె, వేగించిన ఉల్లిపాయలు వేసి మారినేట్‌ చేసుకోవాలి. కనీసం రెండు, మూడు గంటలపాటు మారినేట్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి కొన్ని నీళ్లు పోయాలి. తరువాత అందులో గరంమసాలా, బిర్యానీ ఆకు వేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో బాస్మతి బియ్యం వేసుకోవాలి. బియ్యం సగం ఉడికిన తరువాత నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై వెడల్పాటి పాత్ర పెట్టి మారినేట్‌ మటన్‌ను లేయర్‌లా వేసుకోవాలి. తరువాత దానిపై సగం ఉడికిన బియ్యం వేయాలి. నెయ్యి వేసుకోవాలి. మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా మెత్తటి పిండితో మూయాలి. చిన్నమంటపై 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఎక్స్‌ట్రా దమ్‌ కావాలనుకుంటే మూతపై నిప్పుకణికలు వేయాలి. స్టవ్‌పై నుంచి దింపిన తరువాత వేగించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసి వేడి వేడిగా అందించాలి. 


-వెంకట్‌ ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ గోల్కొండ హోటల్‌

Updated Date - 2021-04-10T19:38:05+05:30 IST