కదలని పనులు

ABN , First Publish Date - 2021-10-23T04:45:19+05:30 IST

నెల్లూరు నగర పరిధిలో చిన్నపాటి వర్షం కురిసినా ఆ నీరు రోడ్లపై పారుతోంది. కాలువలు సరిగ్గా లేకపోవడంతో వర్షపునీరు నగరం వెలుపలకు వెళ్లడం కష్టంగా మారింది.

కదలని పనులు
అన్నమయ్య కూడలి వద్ద వెంగన్న కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క

నగరంలో ఆగిన కాలువల అభివృద్ధి

ఆరు కాలువలకు రూ.82 కోట్లతో పనులు

టీడీపీ హయాంలో ప్రారంభం

రెండేళ్లుగా నిలిచిన నిర్మాణాలు

పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్క

మురికినీరు పారడమే కష్టం,  

   ఇక భారీ వర్షాలు కురిస్తే...


నెల్లూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు నగర పరిధిలో చిన్నపాటి వర్షం కురిసినా ఆ నీరు రోడ్లపై పారుతోంది. కాలువలు సరిగ్గా లేకపోవడంతో వర్షపునీరు నగరం వెలుపలకు వెళ్లడం కష్టంగా మారింది. వర్షపు నీరు అటుంచితే కనీసం మురికినీరు పారడం కూడా సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే 2015లో నగరంలో కురిసిన భారీవర్షానికి నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. అయితే ఈ పరిస్థితి మరోసారి పునరావృతం కాకూడదన్న ఉద్దేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నగరంలో ప్రధాన కాలువలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొత్తం 12 ప్రధాన కాలువలు ఉండగా, మొదటి విడతగా అందులో ఆరు కాలువల అభివృద్ధికి పూనుకున్నారు. 12.5 కిలోమీటర్ల మేర ఈ కాలువలకు ఇరువైపులా లైనింగ్‌తో పాటు మధ్యలో బెడ్‌ వేసేందుకు రూ.82 కోట్లతో పనులు మొదలు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 1.79 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్ధంతరంగా పనులు ఆగిపోయాయి. ఎందుకు ఈ పనులు ఆపారు. మళ్లీ ఎప్పుడు మొదలుపె డతారన్నది కూడా స్పష్టత లేదు. 


పేరుకుపోయిన పూడిక


మినీ బైపాస్‌పై వెళుతున్నప్పుడు అనిల్‌ గార్డెన్స జంక్షనలో రామిరెడ్డి కాలువ కనిపిస్తుంది. అక్కడ రోడ్డుకు రెండు వైపులా కొంతదూరం మాత్రమే కాలువకు లైనింగ్‌ చేసినట్లు చూడవచ్చు. అలానే అన్నమయ్య జంక్షన వద్ద వెంగన్న కాలువది కూడా ఇదే పరిస్థితి. మిగిలిన కాలువల్లో అయితే మరీ దారుణం. ఈ కాలువల ఆధునికీకరణ అర్ధంత రంగా నిలిచిపోవడంతో అప్పటి వరకు చేసిన పని కూడా వృథా అవుతోంది. కాలువల్లో మళ్లీ యథావిథిగా పూడిక పేరుకుపోయింది. చాలా వరకు గుర్రపుడెక్కతో నిండిపోయా యి. ప్రస్తుతం ఈ కాలువల్లో మురికినీరు పారడం కూడా కష్టంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. నగర సంక్షేమం కోసం ప్రారంభమైన కాలువల ఆధునికీ కరణ పనులను ఆపేయడంపై అసహనం వ్యక్తం చేస్తు న్నారు. 


ఎప్పుడు మొదలు పెడతారో..?


2018లో ప్రారంభమైన ఆరు ప్రధాన కాలువల ఆధునికీ కరణ పనులకు మొదటి నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. ఇరిగేషన శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ కాలువల అభివృద్ధిని ప్రజారోగ్య శాఖకు అప్పగించారు. ఆ శాఖ పరిధిలో పనులు జరుగుతున్నప్పుడు కాలువల వాస్తవ డిజైన మారుతోందన్న ఫిర్యాదులు అందాయి. దీంతో చెన్నై నుంచి ఓ నిపుణుల కమిటీని పిలిపించి సర్వే చేయించారు. తర్వాత మళ్లీ పను లు మొదలయ్యాయి. అయితే తర్వాత కాంట్రాక్టర్‌తో ఒప్పం దాన్ని రద్దు చేశారు. గడిచిన రెండేళ్ల నుంచి పనులు జరగడం లేదు. ఇరిగేషన శాఖ పరిధిలోనే మిగిలిన పనులు పూర్తి చేయాలని కొత్త ప్రభుత్వంలో భావించారు. కానీ ఇంత వరకు దీనిపై తుది నిర్ణయం వెలువడలేదు. దీని మూలంగా నగరాభివృద్ధి కోసం చేపట్టిన పనులు ముందుకు కదలడం లేదు. అసలు ఎప్పుడు తిరిగి ఈ పనులు మొదలు పెడతా రో.. ? అసలు మొదలు పెడతారో...లేదో? కూడా అనుమానం గా  ఉంది.

Updated Date - 2021-10-23T04:45:19+05:30 IST