గంజాయి విక్రయదారుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-06-03T10:11:24+05:30 IST

అమాయకమైన ప్రజలు, యువతను టార్గెట్‌ చేసి వారికి గంజాయిని అధిక రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తిని

గంజాయి విక్రయదారుడి అరెస్టు

కడప (క్రైం), జూన్‌ 2: అమాయకమైన ప్రజలు, యువతను టార్గెట్‌ చేసి వారికి గంజాయిని అధిక రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తిని చిన్నచౌకు పోలీసులు పాత బైపాస్‌ వద్ద అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారయ్యాడు. కడప డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం కడప డీఎస్పీ సూర్యనారాయణ, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుని వివరాలను వెల్లడించారు. ఖాజీపేట మండలం బి.కొత్తపల్లెకు చెందిన జంబు రమేష్‌కు విశాఖపట్టణం చింతపాక గ్రామానికి చెందిన సాయితో పరిచయం ఏర్పడి ఇరువురు గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ప్రైవేటు వాహనాల ద్వారా సాయి గంజాయి తీసుకువచ్చి రమే్‌షకు అందించేవాడని, పాత బైపాస్‌ వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో చిన్నచౌకు సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేసి జంబు రమే్‌షను అరెస్టు చేసి అతని వద్ద రూ.లక్ష విలువ చేసే ఆరు కేజీల గంజాయి, రూ.400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సాయి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జంబు రమేష్‌ గతేడాది గంజాయి విక్రయిస్తూ మైదుకూరు పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు.

Updated Date - 2020-06-03T10:11:24+05:30 IST