Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా APలో మళ్లీ నోటిఫికేషనా..?

కడప జిల్లా/కొండాపురం : ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముంపుగ్రామాల్లో స్థానిక ఎన్నికలకు తిరిగి ఎలా నోటిఫికేషన్‌ ఇస్తారంటూ ముంపువాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గండికోట పునరావాస కాలనీలను పాత గ్రామాలను యథాతథంగా ఉంచకుండా పునరావాస కాలనీల్లో ఇష్టమొచ్చినట్లు విలీనం చేశారంటూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండలంలోని సుగుమంచిపల్లె-1, 2, ఓబన్నపేట ఎంపీటీసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేశారు.


రెండుసార్లు ప్రజాభిప్రాయసేకరణ జరిపినప్పటికి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా అలానే ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దత్తాపురం, బుక్కపట్నం, బొమ్మేపల్లె పంచాయతీలను సుగుమంచిపల్లె పంచాయతీలోను, అదేవిధంగా చౌటిపల్లె పంచాయతీని ఓబన్నపేట పంచాయతీలోను విలీనం చేయడంతో దత్తాపురం, చౌటిపల్లె పంచాయతీల గ్రామస్థులు తమ పంచాయతీలు యథాతథంగానే ఉంచాలంటూ స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్‌కాట్‌ చేశారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా తిరిగి ఎన్నికలు నిర్వహించడంపై మరోమారు తదుపరి కార్యాచరణపై గ్రామస్థులమంతా సమావేశం కానున్నట్లు దత్తాపురం గ్రామ నిర్వాసితులు తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement