జగన్ పాలనలో ఎందుకు ముస్లింలకు రక్షణ లేకుండా పోతోంది?

ABN , First Publish Date - 2021-09-12T01:17:25+05:30 IST

జగన్ పాలనలో ఎందుకు ముస్లింలకు రక్షణ లేకుండా పోతోంది?

జగన్ పాలనలో ఎందుకు ముస్లింలకు రక్షణ లేకుండా పోతోంది?

అమరావతి: జగన్ సొంత జిల్లాలో ఓ మైనారిటీ కుటుంబం సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషా కుటుంబానికి జగన్ అంటే అభిమానం. పాదయాత్రలో కూడా జగన్‌ను కలిశారు. అలాంటి వీరి కుటుంబానికి జగన్ పార్టీ నేతల నుంచే ముప్పు వచ్చింది. బాషా భార్యకు వారి పుట్టింటి వారు.. ఎకరం యాభై సెంట్ల భూమి ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని వైసీపీ నేత ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాషా వాపోయారు. తిరుపాల్ రెడ్డికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సీఐ కొండారెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. సీఐ నుంచి తమకు ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో ద్వారా తమ కష్టాన్ని చెప్పుకొన్నారు. తమకు న్యాయం చేయకపోతే అంతా ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అక్బర్ బాషా కుటుంబంపై వేధింపులు బయటపడడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 




ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో  ‘‘ఏపీలో పోలీసు వ్యవస్థ అసలు పని చేస్తోందా?. జగన్ నేతృత్వంలో ప్రజలను పాలిస్తున్నది ప్రభుత్వమేనా?. రాష్ట్రం తమ ఇష్టారాజ్యమని వైసీపీ నేతలు భావిస్తున్నారా?. జగన్ పాలనలో ఎందుకు ముస్లింలకు రక్షణ లేకుండా పోతోంది?. వైసీపీ నేతలు మైనార్టీలను పీడిస్తున్నా జగన్ నోరు మెదపరెందుకు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-09-12T01:17:25+05:30 IST